calender_icon.png 27 November, 2024 | 10:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అధికారులు, సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

27-11-2024 07:36:20 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు పాల్వంచ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం సబ్ డివిజన్లో పనిచేసే పోలీసు అధికారులు, సిబ్బందికి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈసిజీ, గైనకాలజీ, బీపి, షుగర్, దంత సమస్యలు, కళ్ళపరీక్షలు, ఆర్థోపెడిక్, యురాలాజీ, ఫిజియోతెరపి, గుండె సంభంధిత పరీక్షలు, రక్త పరీక్షలు చేసే విధంగా నిపుణులైన వైద్యులు చేత ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ గారు మాట్లాడుతూ.. నిత్యం శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, ప్రజలకు సేవలందిస్తూ పోలీసులు విశ్రాంతి లేని జీవితాన్ని గడపాల్సి వస్తుంది అన్నారు. చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించాల్సి వస్తుందని, అందుమూలంగా పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.

పోలీసులు అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సి వస్తుందని అన్నారు. ఇటీవల జిల్లాలో కొంతమంది పోలీస్ అధికారులు సిబ్బంది అనారోగ్యాలతో బాధపడుతున్నారని దృష్టికి వచ్చి సబ్ డివిజన్లోని పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యాల దృష్ట్యా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నిత్యం ప్రజలకు వైద్య సేవలందిస్తూ, తాము అడగగానే పోలీస్ కుటుంబాలకు కూడా వైద్య చికిత్సలు చేయడానికి విచ్చేసిన వైద్య బృందానికి కూడా ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య వృత్తి కూడా చాలా బాధ్యతాయుతమైన వృత్తి అని కొనియాడారు. అనంతరం ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులందరినీ శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. మొత్తం 120 మంది సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సిఐ వినయ్ కుమార్, ఎస్సైలు సుమన్, సురేష్, రాజశేఖర్, రాజేష్, యాయతి రాజు, జీవన్ రాజు, అశ్వారావుపేట సీఐ కరుణాకర్, వైద్య నిపుణులు ముక్కంటేశ్వర రావు, యుగంధర్ రెడ్డి, కోరా, తదితరులు పాల్గొన్నారు.