ప్రకాశం: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఒంగోలు రూరల్ సీఐ నోటీసులిచ్చారు. ఈ నెల 25న పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆర్జీవీకి సూచించారు. ఈ మేరకు ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ ఆర్జీవీ వాట్సాప్ నెంబర్‌కు నోటీసు పంపించారు. రాంగోపాల్ వర్మ నిన్న విచారణకు హాజరు కాకుండా వారం రోజులు గడువు కోరారు. ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు.