calender_icon.png 27 December, 2024 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి పోలీసుల నోటీసులు

26-12-2024 02:42:42 AM

* 27న విచారణకు హాజరుకావాలని ఆదేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ గతంలో పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

కాగా, సీఎం రేవంత్‌రెడ్డి, ఐజీ శివధర్‌రెడ్డి  తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో సీఐ రాఘవేంద్రతో కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ కేసులో డిసెంబర్ 6న కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చగా అతడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈనెల 27న మరోసారి వ్యక్తిగతంగా విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు.