హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు బుధవారం నోటీసులు ఇచ్చారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో నోటీసులిచ్చారు. బంజారాహిల్స్ పీఎస్ ఇన్ స్పెక్టర్ ఫిర్యాదుతో పోలీసుల కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల నోటీసులపై స్పందించిన కౌశిక్ రెడ్డి తండ్రి అనారోగ్యం వల్ల ఎల్లుండి హాజరుకాలేనని చెప్పారు. మరో తేదీ ఇవ్వాలని కౌశిక్ రెడ్డి పోలీసులను కోరారు.