calender_icon.png 22 October, 2024 | 4:46 AM

పోలీసు అమరవీరుల త్యాగాల చిరస్మరణీయం

21-10-2024 09:16:31 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణ, దేశ సరిహద్దు రక్షణ కోసం విది నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని సోమవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అమరులైన పోలీసుల ముఖ చిత్రాలతో నూతనంగా అమరవీరుల స్థూపం ఏర్పాటు చేయడం విశేషం.

సంస్మరణ దినోత్సవ వేడుకల సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌష్ ఆలం, 2వ బెటాలియన్ కమాండెంట్ నితికా పంత్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం దేశ రక్షణలో, విధి నిర్వహణలో అసువులు బాసిన 214 మంది పోలీసు సిబ్బంది, అధికారుల పేర్లను అదనపు ఎస్పీ సురేందర్ రావు చదువుతూ వారి సేవలను స్మరించుకోన్నారు. మొదటగా ఉన్నతాధికారులు అందరూ కలిసి స్తూపం వద్ద జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం సాయుధ పోలీసులు అమరవీరులకు సలామి శస్త్ర ద్వారా గౌరవ వందనాన్ని సమర్పించి, ఆయుధాలను తలకిందులుగా చేసి శోక్ శస్త్ర ద్వారా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరులను స్మరించుకుంటూ జిల్లా పోలీసు యంత్రాంగం అధికారులు కలిసి స్థానిక కలెక్టర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. తదుపరి అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించే దిశగా జిల్లా పరిపాలన, పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తాందని జిల్లా కలెక్5, ఎస్పీ హామీ ఇచ్చారు.