01-12-2024 06:54:02 PM
మెదక్: రామాయంపేట పట్టణంలో పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ.వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మన తెలంగాణ ప్రాంతంలో చాలామంది అమరులు కావడం జరిగిందన్నారు. అందులో మలిదశ ఉద్యమంలో పోలీస్ శాఖ తరపున తొలిసారి పోలీసు కిష్టయ్య తన ప్రాణాలు బలిదానం చేసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం స్వరాష్ట్రం కోసం పోలీసు కిష్టయ్య ప్రాణాలర్పించడం గొప్ప విషయం, ఆయన సేవలు మరువలేనివని అన్నారు. తొలిదశ ఉద్యమంలో కూడా చాలామంది అమరులైన వారికి ఆయన నివాళులర్పిస్తూ జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజాగౌడ్, ప్రజాసంఘాల నాయకులు ముదిరాజ్ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.