calender_icon.png 29 March, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పతాగిన వ్యక్తిపై పోలీసుల తన్నులు

26-03-2025 08:30:09 PM

కళ్ళు దుకాణంలో విరంగం సృష్టిస్తున్నారని యజమాని ఫిర్యాదు..

కానిస్టేబుల్ హోంగార్డు చేయి చేసుకోవడంతో సస్పెన్షన్ వేటు...

కామారెడ్డి (విజయక్రాంతి): కల్లు దుకాణంలో తప్ప తాగి వీరంగం సృష్టిస్తున్న ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు విధి నిర్వహణలో ప్రవర్తించిన తీరుపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ పట్టణంలోని హారిజనవాడలో గొల్ల శీను అక్కడే నివాసం ఉంటున్నాడు. తాగుడుకు అలవాటు పడిన శీను... సమీపంలోని కల్లు దుకాణంలో కల్లు సేవించి వీరంగం సృష్టించారు.

కల్లు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్ కిరణ్ హోంగార్డు గంగాధర్ సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులను చూసిన శీను కల్లు సీసాతో తలపై బాదుకున్నాడు. తలకు గాయమై రక్తం వస్తుండగా పోలీసులు అతనిని సముదాయించే ప్రయత్నం చేయకుండా వారి వద్ద ఉన్న లాఠీలకు పని చెప్పారు. గొల్ల శీనును చితకబాధారు. ఈ సంఘటన వీడియో వైరల్ కావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం ఎస్పీ రాజేష్ చంద్ర దృష్టికి వెళ్లడంతో వెంటనే కానిస్టేబుల్ కిరణ్ హోంగార్డు గంగాధర్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.