భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో నిర్వహించే గణేష్ నవరాత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు సూచనలు ఇచ్చారు. ముందుగా నిర్వాకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ప్రదేశము నిమజ్జనం తేదీ ప్రదేశం మొదలైన సమాచారాలతో తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్లో పూర్తి వివరాలు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సంబంధిత స్టేషన్ పోలీస్ అధికారులు ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.