calender_icon.png 29 April, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డీ వ్యాపారులలో గుబులు...!

29-04-2025 05:03:59 PM

జిల్లా కేంద్రంలో ఏ ఎస్ పి చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీలు...

15 బృందాలు ఏకతాటిగా సౌదాలు... 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అనుమతులు లేకుండా చిట్టి నడుపుతున్న, వడ్డీ వ్యాపారుల ఇండ్లలో మంగళవారం ఏఎస్పి చిత్తరంజన్(ASP Chittaranjan) ఆధ్వర్యంలో మూకుమ్మడి దాడులు చేపట్టారు. దీంతో జిల్లా కేంద్రంలో కలకలం రేగింది.పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టడంతో వ్యాపారుల్లో గుబులు మొదలైంది. 15 బృందాలు ఒకసారిగా వ్యాపారుల నివాసాలలో సౌధాలు చేపట్టారు. వడ్డీ వ్యాపారం, చిట్టి నిర్వాణపై ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా చిట్టీ వ్యాపారం, వడ్డీ తిప్పుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ముకుమ్మడి దాడులు చేపట్టడం చర్చనీయాంశమైంది. తనిఖీలు చేపట్టిన పోలీసులు వ్యాపారుల వద్ద నుండి చెక్ బుక్, నగదు, లావాదేవీల రిజిస్టర్ లను స్వాధీన పరుచుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చిట్టీలు నడిపిన వడ్డీ వ్యాపారం చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏఎస్పి చిత్తరంజన్ తెలిపారు.