calender_icon.png 12 March, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం కమిషనరేట్ లో పోలీసులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి

12-03-2025 09:49:04 AM

అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలో సిపి అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని,(విజయక్రాంతి): రామగుండం కమిషనరేట్ లో ప్రతిక్షణం పోలీసులు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా సిబ్బందికి సూచించారు. మంగళవారం అర్ధరాత్రి   సమయంలో రామగుండం రైల్వే స్టేషన్, గోదావరి ఖని బస్ స్టాండ్, రామగుండం పోలీస్ స్టేషన్ ను పలుప్రాంతాల్లో ఆకస్మికంగా ఆయన పర్యటించారు. రామగుండం పోలీస్ కమీషనర్ గా బాధ్యత లు స్వీకరించిన  అంబర్ కిషోర్ ఝా  ఆకస్మికంగా అర్ధరాత్రి వేళ గోదావరిఖని, రామగుండం ప్రాంతంలో పరిస్థితి పరిశీలించారు.  పోలీసుల పెట్రోలింగ్, గస్తీ పరిస్థితి ఏ విధంగా ఉందని ప్రత్యక్షంగా పరివేక్షించారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లలో ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం రామగుండం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీడీ బుక్‌ను పరిశీలించారు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలు, విధులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి డ్యూటీ వివరాలపై సిబ్బందిని అడిగి ఆరా తీశారు.