03-03-2025 01:16:03 AM
చర్ల, మార్చి 2 (విజయ క్రాంతి): చర్ల మండల సరి హద్దు రాష్ట్రమైన ఛతీస్‌గౌఢ్ సుక్మ జిల్లా గుండ్రాజ్గూడెం అటవీ ప్రాంతంలో శని వారం జరిగిన ఎదురు కాల్పుల్లో పామేడ్ ఏరియా కమిటీకి చెందిన మావోయి స్టులు సోడి లింగే (ఏసీఎం), పొడియం హడ్మా (ఏసీఎం), మృతి చెందా రు.
మృతుల్లో మొత్తం రూ10 లక్షల రివార్డు ఉన్న హార్డ్కోర్ మావోయిస్టులు ఒక బీజీఎల్ లాంచర్, ఒక 12 బోర్ తుపాకీ, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, నక్సల్ సాహిత్యం, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సుక్మా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవ్హాన్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా శనివారం సుక్మా జిల్లాలో ౄRG మరియు 203 కోబ్రా బలగాలు గుండ్రాజ్గూడెం ప్రాంతానికి చేరుకున్నాయి.
ఈ క్రమంలో సుక్మా ౄRG బలగాలు, మావోయిస్టుల ఎదురు పడటంతో ఇరువైపులా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఇద్దరు హార్డ్కోర్ మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. హతమైన మావోయిస్టుల వివరాలు: సోడి లింగే (ఏసీఎం ఏరియా పడియారో పోల్లో అధ్యక్షురాలు) పశ్చిమ బస్తర్, బీజాపూర్ నివాసి, రివార్డు: రూ5 లక్షలు. పొడియాం హడ్మా (ఏసీఎం, జనతానా ప్రభుత్వం అధ్యక్షుడు) పశ్చిమ బస్తర్, బీజాపూర్ నివాసి, రివార్డు:రూ 5లక్షలు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, ఇతర సామగ్రి:
ఘటనా స్థలం నుంచి ఒక బీజీఎల్ ఉంది లాంచర్
12 -బోర్ తుపాకీ, 2 బీజీఎల్ సెల్స్, 12 -బోర్ తుపాకీ బుల్లెట్లు, 1 వైర్లెస్ సెట్, 4 బీజీఎల్ కాట్రిడ్జ్లు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, మావోయిస్టు సంబంధిత సాహిత్యం, ఇతర నిత్యావసర వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బస్తర్ రేంజ్ ఐజీ పి .సుందరరాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతిస్థాపన కోసం బస్తర్ పోలీసులు,డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, సీఎఎఫ్ ఇతర భద్రతా దళాలు నిరంతరం శ్రమిస్తున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఆపరేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
హిడ్మానే లక్ష్యంగా పోలీసుల నిఘా
గత 60 రోజులలో మొత్తం 67 మంది హార్డ్ కోర్ మావోయిస్టుల మృతదేహాలు భద్రతాబలగాలు స్వాధీనపరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆపరేషన్ పహార్ తో మావోయిస్టుల సంఖ్యా బలం తగ్గుతూ వస్తుంది మరోపక్క కొందరు మావోయిస్టులు వివిధ ప్రాంతాలలో లొంగిపోతున్నప్పటికీ హిడ్మా మాత్రం లొంగిపోయే ప్రసక్తి లేదని చావు రేవో అటవీ ప్రాంతంలో తేల్చుకుంటానని పోలీసులకు సవాలు విసిరిన విషయం తెలిసిందే ,దీంతో భద్రతా బలగాలు హిడ్మా అచుకి కోసం మరింత సమాచారం రాబట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.