calender_icon.png 16 January, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా నల్ల బెల్లం పట్టివేత

05-09-2024 02:46:56 PM

నల్ల బెల్లాన్ని  తరలిస్తున్న  ఇద్దరు సప్లయర్స్ పై కేసు నమోదు, అరెస్ట్.

21.3 టన్నుల నల్ల బెల్లం పట్టివేత..

జడ్చర్ల : ప్రభుత్వ అదేశాలతో ఎక్సైజ్‌శాఖ, నాటుసారాను నిర్మూలించాలనే లక్ష్యంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విస్తృతంగా దాడులు చేస్తుంది. నాటుసారా తయారీని ప్రోత్సహించి లబ్ది లబ్ధిపొందాలని, పల్లెలకు నాటుసారా తయారీకి వినియోగించే నల్ల బెల్లం సరఫరా చేసే ఇద్దరు వ్యక్తులపై ఎక్సైజ్‌ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్‌ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారులు తెలిపిన వివరాలలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లి కి నాటుసారాకు వినియోగించే బెల్లం, పటికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తున్నారు.

పక్కాగా అందుకున్న సమాచారం మహబూబ్ నగర్‌ ఎక్సైజ్‌  ఎన్ఫోర్స్ మెంట్‌ పోలీసులు జడ్చర్ల బస్ స్టాండ్ దగ్గర రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన అశోక్ లేలాండ్ దోస్త్ TS 06 UD 8908 వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించగా  అందులో ఉన్న 60 బ్యాగుల  బెల్లం, ఒక బ్యాగులో 30 కేజీలు మొత్తం 1800 కేజీల బెల్లాన్ని, 10 లీటర్ల నాటుసారాను, 20 కేజీల పటికను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇట్టి బెల్లాన్ని సరఫరా చేస్తున్న కట్రావత్ శ్రీనును అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సామాగ్రిని దేవదరుకుంటా, తెలకపల్లికి తీసుకెళ్తున్నని తెలిపారు. ఇట్టి నెరస్థున్ని తీసుకొని అధికారులు అతను వీటిని తెచ్చిన హైదరాబాద్ లోని శివరాంపల్లి ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్లి అక్కడే ఉన్న అశోక్ లేలాండ్ లారీ KA 28 B 6609 లో ఉన్న 650 సంచుల నల్ల బెల్లం, ఒక్కో సంచి 30 కేజీలు మొత్తము 19500 కేజీలు, 40 కేజీల పటిక, 40 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు.

లారీలో ఉన్న కర్ణాటక లోని బీదర్ కు చెందిన MD రఫీ ని అరెస్ట్ చేశారు. ఇట్టి బెల్లం , సారా ను నాగర్ కర్నూల్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ జిల్లాలకు విక్రయిస్తున్నట్లు నిందితులు తెలిపారని వివరించారు.  ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్న రెండు వాహనములు మొత్తము 21.3 టన్నుల బెల్లం విలువ మొత్తము కలిపి రూ.68.5 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు.  బెల్లాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ మెంట్‌  ఏఈఎస్ శ్రీనివాస్, సీఐలు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, శారద, విప్లవ రెడ్డి, ఎస్సై సృజన్ రావు, నాగరాజు తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. బెల్లం సరఫరా చేస్తున్న వాహనాలను  పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ మెంట్‌ అధికారులను,  సిబ్బందిని ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్ మెంట్ అసిస్టేంట్‌  కమిషనర్  విజయ భాస్కర్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.