కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి లో సోమవారం అక్రమంగా తరలిస్తున్న ఎడ్ల వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ కి చెందిన మోహిన్ అనే వ్యక్తి కొరకు మహమ్మద్ వాజిద్ అనే వ్యక్తి మొరంపల్లి బంజర నుంచి 14 ఎద్దులను TS18 UE 3730 మిని గూడ్స్ వాహనంలో కబేలాకి తరలిస్తుండగా టేకులపల్లి పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుకున్నారు. ఎద్దులను పాల్వంచ గోశాలకు తరలించి, కేసు నమోదు చేసినట్లు టేకులపల్లి ఎస్సై పోగుల సురేష్ తెలిపారు.