01-03-2025 08:55:17 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓబి కార్మికుడు హత్య సంఘటన సబ్ డివిజన్లో సంచలనంగా మారింది. అత్యధిక సంబంధించిన సమాచారం తెలుసుకున్న మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ సతీష్ లు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని హత్యకు సంబంధించిన విచారణను ప్రారంభించిన విషయం విధితమే. కాగా హత్యకు సంబంధించిన మిస్టరీని ఛేదించేందుకు పోలీసు జాగిలాలు సైతం రంగప్రవేశం చేశాయి. హంతకులను గుర్తించే విషయంలో పోలీస్ జాగిలాల పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మృతుడు ముని ప్రసాద్ హత్యకు గురికాబడిన సంఘటన రోజుకు ముందు తాను ఎవరితో సాన్నిహిత్యంగా తిరిగాడో తెలుసుకునేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల సీసీ ఫుటేజీలను సైతం పోలీసులు పరిశీలించారు. ఏరియాలోని అప్లోడింగ్ దుర్గా కంపెనీలో పనిచేస్తున్న కార్యాలయ సిబ్బందితో పాటు పలువురిని అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిసింది. పోలీసుల విచారణలో భాగంగా పలు కీలక అంశాలను సేకరించి హాంతకుడ్ని గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముని ప్రసాద్ ప్రత్యేక సంబంధించిన పలు కీలక అంశాలను సేకరించి హత్యకు గల కారణాలను పోలీసులు శోధిస్తున్నారు. అయితే పోలీసులు హంతకుడిని గుర్తించిన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వినోద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
హత్య కేసును దాదాపు చేదించాం: మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి..
మణుగూరు ఏరియాలోని సింగరేణి ఆఫ్ లోడింగ్ దుర్గా ఓబీ కంపెనీలో పనిచేస్తున్న ముని ప్రసాద్ హత్యకు సంబంధించిన కేసును దాదాపు సేదించామని మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను అడగగా ఆయన ఆ విధంగా స్పందించారు. ముని ప్రసాద్ హత్యలో నిందితులు ఒకర మరింక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే అత్యధిక సంబంధించిన అన్ని వివరాలను ప్రకటిస్తామన్నారు.