22-04-2025 12:00:00 AM
జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ఐపీఎస్
సిరిసిల్ల, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): ఆన్‌లైన సెంటర్లే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడు తున్న ప్రధాన నిందితుడు దాసరి మురళి ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి గితే మాట్లాడుతూ మహారాష్ట్ర భివండి కి చెందిన దాసరి మురళి అనే వ్యక్తి భివండిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపించుకుంటు వచ్చిన డబ్బుతో జీవనం కోసాగించగా విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ఎలాగైనా సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలని భివండికి చెందిన తన స్నేహితులు అయిన విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అనే వ్యక్తులతో కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు.
మురళి ఆన్లైన్ సెంటర్ లను లక్ష్యంగా చేసుకొని మొదటగా ఆన్లైన్ సెంటర్ వ్యక్తులకు కాల్ చేసి తనని తను ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా పరిచయం చేసుకుని నాకు రోజు వారిగా నాకు ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువగా ఉంటాయని, నేను మా వారితో నగదు డబ్బులు పంపిస్తాను నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలని నమ్మించి విలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ ల అకౌంట్ లోకి వెళ్లేలా ప్రణాళిక చేసుకొని వారి అకౌంట్ లోకి వచ్చిన నగదు ను ఐదుగురు పంచుకుంటూ మోసాలకు పాల్పడటం జరుగుతుందన్నారు.
అందులో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధిలోని అగ్రహారంలో గల ఒక ఆన్లైన్ సెంటర్ ను, సిరిసిల్లలో గల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను లక్ష్యంగా చేసుకొని దాసరి మురళి అనే నిందుతుడు వారిని మోసం చేయగా అట్టి యజమానులు వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారని తెలిపారు. వేములవాడ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నాలుగురు వ్యక్తులువిలేష్ పటేల్, చిరగ్ రమేష్ పేతడ్, జింతేంద్ర సోమాభాయ్, నిలేష్ జై సింగ్ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగిందని,పరారీలో ఉన్న దాసరి మురళి అనే వ్యక్తి కోసం వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఎస్.ఐ రమేష్ సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్,కానిస్టేబుళ్లు ఇమ్రాన్, షమీ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా కోరూట్ల వద్ద అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో వేములవాడ టౌన్ ఎస్.ఐ రమేష్, సైబర్ టీం ఆర్.ఎస్.ఐ జునైద్, కానిస్టేబుళ్లు ఇమ్రాన్,షమీ పాల్గొన్నారు.