calender_icon.png 22 December, 2024 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

22-12-2024 05:58:20 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్-2 గ్రౌండ్ లో ఏసీపి ఏ.రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సబ్ డివిజన్ పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. బెల్లంపల్లి పోలీసు సబ్ డివిజన్ పరిధిలో గల నాలుగు పోలీసు జట్లు ఈ మ్యాచ్ లో తలపడ్డాయి. మందమర్రి వారియర్స్, తాండూర్ పాంథర్స్, బెల్లంపల్లి టౌన్ హంటర్, బెల్లంపల్లి రూరల్ లెజెండ్స్ జట్లు పోటీల్లో తలపడగా, బెల్లంపల్లి రూరల్, తాండూర్ పాంథర్స్ జట్లు ఫైనల్ కు చేరుకుని హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పోటీల్లో తాండూర్ ఫాంథర్స్ జట్టు గెలుపొందగా, బెల్లంపల్లి రూరల్ లెజెండ్స్ జట్టు రన్నర్ గా నిలిచింది.

ఫైనల్ పోటీల్లో తలపడ్డ ఇరుజట్లకు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం శ్రమకోర్చి విధులను నిర్వర్తిస్తున్న పోలీసులకు ఈ క్రీడలు ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని చేకూరుస్తాయన్నారు. పోలీసులు క్రీడల్లోనూ ప్రతిభ చూపి గుర్తింపు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి, బెల్లంపల్లి రూరల్, తాండూర్, మందమర్రి సిఐలు ఎన్.దేవయ్య, సయ్యద్ అఫ్జలొద్దిన్, కుమారస్వామి, శశిధర్ రెడ్డి లతో పాటు సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.