calender_icon.png 21 October, 2024 | 3:31 AM

అక్టోబర్ 21 నుంచి పోలీస్ ఫ్లాగ్ డే సంస్మరణ దినోత్సవాలు

20-10-2024 07:55:43 PM

వికారాబాద్,(విజయ క్రాంతి): పోలీస్ అమరవీరుల ప్రాణత్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు జరుగుతాయని జిల్లా ఎస్.పి కే. నారాయణ రెడ్డి తెలిపారు. ఈ సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21వ తేది నుండి అక్టోబర్ 31వ తేది వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు పాల్గొని విజయ వంతం చెయ్యాలని కోరారుపోలీస్ సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు, పోలీస్ అధికారులకు వ్యాసరచన పోటీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు, రక్తదాన కార్యక్రమాలు మొదలగు వివిధ కార్యక్రమాలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు తదితరుల పాల్గొన్నారు.