calender_icon.png 26 October, 2024 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాలలో పోలీస్ కుటుంబ సభ్యుల నిరసన..

26-10-2024 12:42:30 PM

మంచిర్యాల (విజయక్రాంతి): పోలీసులతో వెట్టి చాకిరి చేయించడం నిరసిస్తూ 13వ టీ జి ఎస్ పి బెటాలియన్ ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీద రాస్తారోకో నిర్వహించారు. వి వాంట్ ఎక్ పోలీస్ అంటూ నినదించారు. రాష్ట్రంలో ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని, సిఎం రేవంత్ రెడ్డి పోలీస్ కుటుంబం నుండే వచ్చి మా బాధ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా భర్తలు చేసేది పేరుకే పోలీస్ ఉద్యోగమని కానీ వారి చేత నిత్యం మొక్కలకు నీరు పట్టించడం, చెత్త చెదారం ఏరి వేయడం లాంటి కూలి పనులు చేపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మేల్కొని తమకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గుడిపేట బెటాలియన్ పోలీస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.