calender_icon.png 2 April, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

31-03-2025 11:19:15 PM

ఎస్ఐని ఢీకొట్టిన కారు..

పటాన్ చెరు: పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో వచ్చిన కారును ఆపే ప్రయత్నం చేయగా... ఆపకుండా ఎస్ఐ ని ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళ్తే... జిన్నారం ఎస్ఐ నాగలక్ష్మి సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం జిన్నారం శివారులోని ఎంపీడీవో కార్యాలయం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. మంగంపేట నుంచి జిన్నారం వైపు వస్తున్న వాహనాలను ఆపి వాహనం నడుపుతున్న వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మద్యం సేవించి కారు నడుపుతున్న వ్యక్తిని ఎస్ఐ విచారిస్తున్న క్రమంలో మరో కారు దూసుకొచ్చింది. కారును ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమవగా ఎస్ఐ నాగలక్ష్మిని ఢీకొట్టి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ లు కారును వెంబడించగా లక్మీపతి గూడెం సమీపంలో కారును వదిలి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఎస్ఐ నీ ఢీకొట్టిన కారు ఏపీ 12 పీ 0003, కారు పోలీస్ ల అదుపులో ఉంది.