calender_icon.png 24 February, 2025 | 9:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లెందులో ఆటోలకు కొత్త స్టిక్కర్లు పంపిణీ చేసిన పోలీసులు

24-02-2025 06:19:38 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశంతో ఇల్లందు డిఎస్పి చంద్రభాను సోమవారం ఇల్లెందులోని ఆటోలకు కొత్త స్టిక్కర్లు పంపిణీ చేసారు. ఇల్లందు పట్టణ పోలీసులు ఇల్లందు పట్టణంలో 420 ఆటోలు ఉన్నట్లు గుర్తించారు. ఆటోలు అన్నింటికీ కొత్త స్టిక్కరింగ్ ఇవ్వడం జరిగిందని డిఎస్పి తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్ కు కొత్త నెంబర్ తో పాటు డ్రైవర్, ఓనర్ వివరాలు ఆటో నెంబర్ తో పాటు అన్ని నోట్ చేయడం జరిగిందని తెలిపారు. వారికి ప్రతి అడ్డా నుంచి సీరియల్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఆటోకి ఇచ్చిన కొత్త నెంబర్ జిల్లాలో ఎక్కడ తిరిగినా ఈ నెంబర్ ని తాము ఈజీగా ఐడెంటిఫై చేసి గుర్తించగలమన్నారు. ప్రతి ఒక్క ఆటో డ్రైవరు కొత్త స్టిక్కర్ను ధరించాలని తెలిపారు. అతిక్రమించిన, ఒకరి ఆటో ఒకరు నడిపిన చెల్లదని అన్నారు. త్వరలో టేకులపల్లి, బోడు, ఆళ్ళపల్లి, గుండాల, కొమరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోలకు కూడా ఇస్తామన్నారు. కార్యక్రమంలో ఇల్లెందు సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.