calender_icon.png 31 March, 2025 | 11:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కానిస్టేబుల్ కుటుంబానికి పోలీస్ శాఖ అండ

21-03-2025 12:00:00 AM

ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, మార్చి 20(విజయక్రాంతి): విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ వడ్ల రవి కుమార్ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ వడ్ల రవి కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ రవికుమార్ ను కోల్పోవడం డిపార్ట్మెంట్ కు తీరని లోటన్నారు.

విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మరణించిన రవికుమార్ మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చరి లో ఉన్న  మృతదేహాన్ని సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ రవికుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎల్లప్పుడూ పోలీసు వ్యవస్థ తమ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ రవికుమార్ కు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయనతోపాటు అడిషనల్ ఎస్సీ చైతన్య రెడ్డి పోలీస్ అధికారులు పాల్గొన్నారు.