హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉపయోగించని దుస్తులు, తోలు వస్తువులు, ఇతర కిట్ సామాగ్రి విక్రయానికి సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 28న ఉదయం 11 గంటలకు లక్డీకపూల్‌లోని డీ జీపీ కార్యాలయంలో ఉన్న సెం ట్రల్ స్పోర్ట్స్ సెంటర్‌లో ఈ వేలం జరగనుంది. ఆసక్తి ఉన్న బిడ్డర్స్ ఈ బహిరంగ వేలంలో పాల్గొనాలని ప్రకటనలో సూచించారు. బిడ్డింగ్‌కు వచ్చే వారు తమ ఆధార్‌కార్డును వెంట తీసుకురావాలని కోరారు.