calender_icon.png 23 February, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబ్బంది సమస్యల పరిష్కారానికే 'పోలీస్ దర్బార్'

22-02-2025 04:29:04 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికే 'పోలీస్ దర్బార్'(Police Darbar) నిర్వహిస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు(Ramagundam Police Commissioner M Srinivasulu) అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్(Ramagundam Commissionerate Headquarters)లో స్పెషల్ పార్టీ, క్యూఆర్టీ సిబ్బంది, అధికారులకు నిర్వహించిన 'దర్బార్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలాంటి సమస్యలు ఉన్న దర్బార్ లో చెప్పవచ్చని, దర్బార్ లో చెప్పడం కూడా ఇబ్బందిగా ఉంటే నేరుగా తన కార్యాలయానికి వచ్చి చెప్పవచ్చన్నారు. పోలీస్‌ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోనాల్సి వుంటుందని, క్రమ శిక్షణ, ప్రణాళిక బద్దంగా విధులు నిర్వహించడం ద్వారా ఈ ఒత్తిళ్లను అధిగమించవచ్చన్నారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే   మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని, కొన్ని సందర్బాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందన్నారు.

కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుందని, క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబం గురించి ఆలోచించాలని సూచించారు. సిబ్బంది క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వర్తించి రామగుండం కమిషనరేట్ కి, తెలంగాణ పోలిస్ కు మంచిపేరు తీసుకురావాలన్నారు. బయట డ్యూటీస్ కి వెళ్ళినప్పుడు ఇబ్బందులుంటె సంబందిత అదికారులకు తెలియజేయాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, మంచిప్రవర్తనతో విదులు నిర్వర్తించినప్పుడు అదికారులు తమ వెంట ఉంటామన్నారు. ఈ సంధర్భంగా సిబ్బందికి చేయవలసిన విధులు, చేయకూడని పనుల గురించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించినట్లైతే, పోలీస్ శాఖ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సీ. రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, ఆర్ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.