ఇబ్రహీంపట్నం, ఆగస్టు 3, (విజయక్రాంతి) : ఇబ్రహీంపట్నం పోలీసులు శనివారం సైకిళ్లపై సవారీ చేసి పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణమంతా కలియదిరిగి ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను చాటి చెప్పారు. సీఐ సత్యనారాయణ, ఎస్సైలు కూడా సైకిళ్లు తొక్కుతూ సిబ్బందిని ఉత్సాహపరిచారు. ప్రధాన కూడళ్లలో ఆగి స్థానికులతో ముచ్చటించారు. ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. సైకిల్ పెట్రోలింగ్ ప్రజలకు మరింత భరోసానిస్తుందని సీఐ తెలిపారు.