calender_icon.png 25 September, 2024 | 9:58 PM

జానీ మాస్టర్‌కు పోలీసు కస్టడీ

25-09-2024 04:24:45 PM

హైదరాబాద్‌: జానీమాస్టర్‌గా పేరుగాంచిన షేక్‌ జానీబాషాపై నమోదైన అత్యాచారం కేసును విచారిస్తున్న నార్సింగి పోలీసులకు బుధవారం నాలుగు రోజుల కస్టడీని కోర్టు మంజూరు చేసింది. దీంతో నేటి నుండి ఈ నెల 28వ తేదీ సాయంత్రం 4.30 గంటల వరకు జానీ మాస్టర్‌కు పోలీసు కస్టడీలోకి తీసుకోనున్నారు. 28న సాయంత్రం వరకు జానీ మాస్టర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.

జానీ మాస్టర్ ను కోర్టుకు తీసుకొచ్చే ముందు మెడికల్ టెస్ట్‌లు చేయించి ఆ రిపోర్ట్‌లను కోర్టులో సమర్పించనున్నారు. జానీ మాస్టర్ పై ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదన్న కోర్టు పోలీసులను ఆదేశించింది.  జానీ మాస్టర్ తన సహాయకు రాలిపై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబరు 15న పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలో సైబరాబాద్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ టీమ్ జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ తీసుకొచ్చి సెప్టెంబర్ 20న కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో జానీ మాస్టర్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.