27-03-2025 01:41:51 AM
కొత్తపల్లి, మార్చి 26: సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని ట్రైనీ ఐపీఎస్ వసుంధర యాదవ్ అన్నారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొత్తపల్లి మండలం ఎలగందల్, బావుపేట గ్రామలలోని బెల్ట్ షాపులలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడి చేయగా ఎలగందల్, బావుపేట గ్రామలలోని నాలుగు బెల్ట్ షాప్ ల నుండి అధిక సంఖ్యలో మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నామని, 40వేల 735లీటర్ల మద్యం వీటి విలువ సుమారుగా రూ.26,280 ఉంటుందన్నారు.
దీంతో పాటు నాలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.అనుమతులు లేకుండా,చట్టవిరుద్ధంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఈ సందర్బంగా హెచ్చరించారు. పోలీసులు నిరంతరం తమ మూడో కన్నుతో పహారా కాస్తుంటారని తెలిపారు.చుట్టు పక్కల ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.ఈ సమావేశంలో ట్రైనీ ఎస్‌ఐ స్వాతి, ఎఎస్‌ఐలు , కానిస్టేబుల్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.