calender_icon.png 8 April, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇద్దరు దొంగలు అరెస్ట్

06-04-2025 08:38:56 PM

పటాన్ చెరు: గుమ్మడిదల మండలంలో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసును పోలీసులు చేదించారు. దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలను గుమ్మడిదల ఎస్సై మహేశ్వర్ రెడ్డి ఆదివారం సాయంత్రం వెల్లడించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్ పల్లికి చెందిన షేక్ ఫయాజ్ @ ఫయూ, చాపల సంజీవ్ @ నవాజ్ ఇద్దరు కలసి గుమ్మడిదల, రామ్ రెడ్డిబావి, కానుకుంట, నల్లవల్లి గ్రామాలలో రాత్రి వేళలో తిరుగుతూ గ్రామానికి బయట ఉన్న దేవాలయాలను ఎంచుకొని హుండీలను పగలగొట్టి డబ్బులను, ఇతర వస్తువులను దొంగలిస్తున్నారు. ఆదివారం ఉదయం గుమ్మడిదల పోలీసులు, సంగారెడ్డి సీసీయస్ పోలీసులు కలిసి వారిని అదుపులోకి తీసుకొని విచారించి వారి నుంచి రూ.25 వేల నగదు, ఒక బైకు, రెండు సెల్ ఫోన్ లను స్వాదీనం చేసుకొని వారిని కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. షేక్ ఫయాజ్ @ ఫయు మీద 33 దొంగతనం కేసులు, చాపల సంజీవ్ @ నవాజ్ మీద 26 దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు.