calender_icon.png 17 April, 2025 | 10:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలుర మిస్సింగ్ కేసును చేదించిన పోలీసులు

08-04-2025 06:09:48 PM

అభినందించిన ఎస్పీ..

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఇద్దరు బాలురు కనిపించకుండా పోయిన కేసులో వెంటనే చురుకైన చర్యలు చేపట్టి మిస్సింగ్ బాలురను 18 గంటల వ్యవధిలోనే గుర్తించిన బిర్కూర్ పోలీసులను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ మంగళవారం అభినందించారు. కామారెడ్డి జిల్లా బిర్కూర్ మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు బాలురు ఈ నెల 7న ఉదయం 9 గంటల నుండి కనిపించకుండా పోగా నిన్న సాయంత్రం 6 గంటలకు బీర్కూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీర్కూర్ ఎస్ హెచ్ ఓ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి వెంటనే మిస్సింగ్ బాలుర కోసం వెతకడం ప్రారంభించారు.

బిర్కూర్ పోలీసులు మిస్సింగ్ అయిన బాలుర ఆచూకీ తెలుసుకొనుట కొరకు అన్నిరకాల సమాచారాలను సేకరిస్తూ, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమన్వయంతో సాగిన నిరంతర శోధనా ప్రయత్నాల్లో మిస్సింగ్ అయిన ఇద్దరు బాలురులను 18 గంటల వ్యవధిలోనే గుర్తించడం జరిగింది. బాలురను సురక్షితంగా గుర్తించి ఆందోళనకు గురి అవుతున్న వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మిస్సింగ్ బాలురను అతి తక్కువ సమయంలో బీర్కూర్ పోలీస్ లు సమన్వయంతో చాకచక్యంగా వ్యవహరించి మిస్సింగ్ అయిన బాలురులను గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడముతో బిర్కూర్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు.