calender_icon.png 25 February, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మర్డర్ కిడ్నాప్ రేప్ కేసును ఛేదించిన పోలీసులు..

24-02-2025 11:19:32 PM

వివరాలు వెల్లడించిన మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్...

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ కిడ్నాప్ రేప్ కేసుకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన వివరాలను మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ఎండీ నసీర్ (41), నెహ్రూ నగర్‌లో నివాసం ఉండే ఎండీ పక్రుద్దిన్‌లు చిన్ననాటి స్నేహితులు, అయితే పక్రుద్దిన్ జహీరాబాద్‌లో ఉండే మరో స్నేహితుడి ద్వారా నసీర్ మంత్ర విద్యలు వస్తాయనే విషయం తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని ఒకసారి నసీర్‌ను అడిగితే సీరియస్ అయి అప్పటి నుండి సరిగ్గా మాట్లాడటంలేదు. ఇదే విషయమై రెండు, మూడు సార్లు గొడవపడ్డారు. నెల కిందట పక్రుద్దిన్ వాళ్ల చెల్లికి పెళ్ళి సంబంధం వచ్చి క్యాన్సిల్ అయ్యింది. దీంతో పాటు పక్రుద్దిన్ వాళ్ల తండ్రికి ఫెరాలసిస్ వచ్చి కాళ్ళు, చేతులు పనిచేయడం లేదు. 

అదేవిధంగా పక్రుద్దిన్‌కు తరచూ వీర్యం పడుతుండడంతో చేతబడి చేస్తున్నాడనే అనుమానం మరింత బలపడింది. తన ఫ్యామిలీకి నసీర్‌తో ఎప్పటికైనా ముప్పు ఉందని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో 21వ తేదీ రాత్రి 8 గంటలకు మాట్లాడుకుందాం రమ్మని చెప్పి పక్రుద్దిన్ నసిర్‌ను గోపినగర్ చెరువు వద్దకు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో బురాన్, మహమ్మద్ కలీం, అజార్, మొహమ్మద్ అలీలు ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో నసీర్‌ను ఒకరి వెనుక ఒకరు కట్టెతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన తర్వాత కొండాపూర్ ఏరియా ఆసుపత్రి వద్ద వదిలేసి పారిపోయారు. నసీర్ స్నేహితులు అక్కడకు చేరుకొని నసీర్‌ను కొండాపూర్ ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని దృవీకరించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దారుణంగా హత్య చేసిన నిందితులను బురాన్, మహమ్మద్ కలీం, అజార్, మొహమ్మద్ అలీ (పరారీ)లను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

మహిళా కిడ్నాప్ అపై రేప్ కేసును ఛేదించిన మియాపూర్ పోలీసులు..

మియాపూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ కిడ్నాప్, ఆపై రేప్ కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చందానగర్ శాంతినగర్‌కు చెందిన నిందితులు బాల కుమార్ (25), మహేష్ (24)లను పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుండి యాక్టివా వాహనం, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.