calender_icon.png 7 April, 2025 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల అవినీతి పెరిగింది

27-03-2025 12:12:28 AM

ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్

పోలీసుల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిందని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ  చేశారు. ట్రాఫిక్ పోలీసులు వారి విధులు ఎన్నడో మర్చిపోయారని... దానికి బదులుగా కెమెరాలు చేత బట్టి క్లిక్ క్లిక్ మనిపిస్తూ ఫొటోగ్రాఫర్ డ్యూటీ చేస్తున్నారని విమర్శించారు. రోజంతా కష్టపడితే రూ.వెయ్యి కూడా సంపాదించని నిరుపేదల బైక్‌ను వెనకనుంచి ఫొటో కొట్టి వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో 28.94 శాతం రేప్ కేసులు పెరిగిపోయాయని అన్నారు. మహిళలపై క్రైం శాతం 4.8 శాతం పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో క్రైం రేట్ 41 శాతం పెరిగిందని ఇదంతా పోలీసుల వైఫల్యం వల్లేనని ఆరోపించారు.  ధరణి పేరిట తెచ్చిన భూభారతిలో కొత్తేమీ లేదని అంతా అదే సాఫ్ట్‌వేర్ అని కేవలం పేరు మార్చారని అక్బర్ బాంబు పేల్చారు.