ఇల్లెందు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఇల్లందు మండలం బొజ్జయిగూడెం గ్రామంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ చంద్రభాను, సీఐ సత్యనారాయణతో పాటు ఎస్సైలు, 15 మంది పోలీసులు సోమవారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించి ఎటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేనటువంటి 60 మోటార్ సైకిళ్లను, ఆరు ఆటోలను సీజ్ చేశారు.
బైకులకు ఇన్సూరెన్స్ పేపర్స్(Insurance papers) తప్పక ఉండాలన్నారు. లేదంటే ప్రమాదాలు సంభవించినప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ కాకుండా పోతాయని, కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. అదేవిధంగా గ్రామాలలో నిషేధిత గంజాయిని ఎవరైనా వాడినా, అమ్మినా వారిపై కేసులు నమోదవుతాయని తెలిపారు. దొంగతనాలు జరిగినప్పుడు ఎవరి పై అనుమానం ఉన్నా తమకు తెలియజేయాలని గ్రామస్తులకు డీఎస్పీ చంద్ర భాను వివరించారు. తక్షణమే బైకులకు ఫైన్ కట్టి వెంటనే పేపర్స్ డాక్యుమెంట్స్ చేపించుకోవాలని సూచించారు.