calender_icon.png 13 November, 2024 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితుల వద్దకే పోలీస్

11-11-2024 09:30:53 PM

సమస్యలు తెలుసుకుని బాధితునికి న్యాయం చేసిన గోదావరిఖని ఏసీపీ రమేష్

మంథని,(విజయక్రాంతి): ఒకప్పుడు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్ కు పోయి బాధితులు ఫిర్యాదు చేస్తేనే స్పందించే పోలీస్ శాఖలో మార్పు కనపడుతుంది.  ఇప్పుడు నేరుగా బాధితుల వద్దకే పోలీసులు వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు. పెద్దపెల్లి జిల్లాలోని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్  ఏకంగా పోలీస్ స్టేషన్ కు రాలేని బాధితుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.   

వివరాలలోకి వెళ్తే గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీ కి చెందిన పెద్ద లక్ష్మయ్య తన ఇద్దరు కొడుకులు తనని పట్టించు కోవడం లేదని, తన కాలు బాలేనందున ఆఫీస్ లోపలికి రావడం లేదని తెలుసుకున్న ఏసీపీ నేరుగా బాధితుని దగ్గరకి వచ్చి వారి సమస్య విని పిటిషన్ తీసుకొని అక్కడిక్కడికే తన కొడుకులతో మాట్లాడి, కౌన్సిలింగ్ కోసం కుమార్ లను స్టేషన్లకు పిలిచి సమస్యను పరిష్కరించి, ప్రస్తుత వైద్య ఖర్చుల కోసం వేయ్యి రూపాయలు ఏసీపీ బాధితునికి అందచేశారు. దీంతో బాధితుడు వైసీపీకి కృతజ్ఞతలు తెలిపారు.