calender_icon.png 28 December, 2024 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి ఎంపీపై అనుచిత వాఖ్యలు.. పోలీసులకు ఫిర్యాదు

27-12-2024 11:19:05 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna) ఈనెల 24న సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ను ఉద్దేశించి ఈనెల 26న మంచిర్యాలకు చెందిన గోగుల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపులో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు మాల మహానాడు నాయకులు కాసర్ల యాదగిరి శుక్రవారం రాత్రి తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాజకీయ నేతలు, ఎస్సార్ మీడియా 2 వాట్సాప్ గ్రూపులో 'తస్సా రావుల బొడ్డు, ఏదో ఉద్ధరిస్తావని ' 'నువ్వేమిటి వెలగబెడతావు' అంటూ మా నాయకుడిని అసభ్యకరంగా, అవమానపరిచి వివిధ పార్టీల మధ్య, వర్గాల మధ్య శత్రుత్వం పెంపొందించే విధంగా వాఖ్యలు చేసిన గోగుల రవీందర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. సోషల్ మీడియాలో ఎంపీ వంశీకృష్ణ పై అనుచిత వాఖ్యలు చేసిన గోగుల రవీందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.