హైదరాబాద్ నవంబర్ 7(విజయక్రాంతి): 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ కాళీచరణ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మల్కాజ్‌గిరికి చెందిన రాజేశ్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. నిబంధన ప్రకారం సివిల్ సర్వెంట్ ప్రైవేట్ బిజినెస్ చేయకూడదు. ఒక వేళ చేస్తే.. డీఓపీటీ అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది.
అయితే తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర బయోడైవర్సిటీ సెక్రటరీగా పనిచేస్తున్న కాళీచరణ్.. తనకు తెలిసిన వ్యక్తితో వ్యాపారం చేశారు. ఆ వ్యాపారంలో భాగంగా తన పార్టనర్ తనకు నెలకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వడం లేదని పోలీస్ స్టేషన్‌లో కాళీచరణ్ తన భాగస్వామిపై కేసు పెట్టినట్లు పిటిషనర్ పేర్కొన్నారు.
ఐఏఎస్ అధికారి డీఓపీటీ అనుమతి లేకుండా బిజినెస్ చేయొద్దని, ఇది నిబంధనలకు విరుద్ధమని, చర్యలు తీసుకోవాలంటూ రాజేశ్‌కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేవారు. డీఓపీటీ అనుమతి తీసుకొని కాళీచరణ్ వ్యాపారం చేశారా? లేదా? అనే కోణంలో విచారణ చేపట్టనున్నారు.