25-03-2025 07:07:25 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) పై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay Kumar) నిరాధారమైన, అప్రమాణికమైన వ్యాఖ్యలు మాట్లాడారని మంగళవారం కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేసీఆర్ కు బీదర్ లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఎన్నికల్లో ఆ నోట్లు ఓటర్లకు పంపిణీ చేశారని వాఖ్యనించడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే ఉద్దేశంతోనే బండి సంజయ్ మాట్లాడడం జరిగిందని వెంటనే మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ రావు, రాజు, అంజన్న, శ్రీనివాస్, నరేందర్, శోభన్, రాజేష్, రావుజి, వినోద్, శివ, వాసు తదితరులున్నారు.