calender_icon.png 27 February, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి కాలికి గాయం.. సహాయం చేసిన పోలీస్ కమిషనర్

27-02-2025 12:01:02 AM

మేడ్చల్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): కీసరగుట్టలో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కాలికి గాయమైన వ్యక్తికి వైద్య సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఒక వ్యక్తికి కాలికి గాయమై బాధపడుతుండగా సుధీర్ బాబు స్వయంగా వెళ్లి పరిశీలించారు. వెంటనే ఫస్ట్ ఎయిడ్ కిట్టు తెప్పించి కట్టు కట్టారు. ఆ తర్వాత అంబులెన్స్ రప్పించి ఆసుపత్రికి పంపించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. 15 రోజుల ముందే భద్రత ఏర్పాట్లు మొదలు పెట్టామని, అన్ని స్థాయిల అధికారులకు సూచనలు ఇచ్చామని అన్నారు.