12-03-2025 12:00:00 AM
సిరిసిల్లలో ఘటన
సిరిసిల్ల, మార్చి 11 (విజయక్రాంతి): లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతిచెందారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్దులం గ్రామానికి చెందిన తోట గంగారాం(58) మూడు నెలల క్రితం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17 వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. సోమవారం అర్ధరాత్రి అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్ వద్ద గంగారం ఆగారు. లిఫ్టులో వెళ్లేందుకు వేచి చూస్తున్నారు. లిఫ్ట్ రాకముందే వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లడంతో ఒక్కసారిగా మూడో అంతస్తు నుంచి ఒకటో అంతస్తులో ఉన్న లిఫ్ట్‌పై పడిపోయారు.
ప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడి చేరుకొని తాళ్ల సాయంతో గంటపాటు శ్రమించి తీవ్రంగా గాయపడ్డ గంగారాంను బయటకు తీశారు. ఆసుప తరలించెలోపే గంగారం మృతి చెం పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్యరేఖ, కొడుకు సతీష్‌కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. గంగారం గతంలో సెక్రటేరియట్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించారు. గంగారం మృతి పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుభూతి తెలిపారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గంగారం మృతదేహానికి పూలమాలలు, సానుభూతి ప్రకటించారు.