10-02-2025 08:07:07 PM
నార్కోటిక్ డాగ్స్ ద్వారా గుర్తింపు
హుస్నాబాద్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు పోలీసులు నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాత్రి సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టణంలోని పలు కిరాణాలు, బేకరీలు, టీ స్టాళ్లు, పాన్ డబ్బాలు తదితర అనుమానాస్పద ప్రదేశాల్లో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలున్నాయేమోనని నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీ చేశారు. గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. వాటిని అమ్మేవారితోపాటు కొనేవారిపై నిఘా పెట్టినట్టు చెప్పారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల చాక్లెట్లు కలిగి ఉన్నా, రవాణా చేసినా, ఇతరులకు అమ్మినా 100కు ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వాలన్నారు.