calender_icon.png 27 December, 2024 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండలో పోలీసుల తనిఖీలు

08-11-2024 12:00:00 AM

49 మందిపై కేసులు, 14 వాహనాలు సీజ్ 

నల్లగొండ, నవంబర్ 7 (విజయక్రాంతి): నల్లగొండ పట్టణంలోని వన్, టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిం చారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 29 మందిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 16 మంది ని అదుపులోకి తీసుకున్నారు. నెంబర్ ప్లేట్, సరైన ధ్రువపత్రాలు లేని  14 వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు వన్, టూటౌన్ సీఐలు ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, డానియేల్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి జరిమానా విధించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు పేర్కొన్నారు.