calender_icon.png 19 April, 2025 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాల కోసం పోలీసుల తనిఖీలు

19-04-2025 04:23:46 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో నకిలీ విత్తనాల వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నకిలీ విత్తనాలను కంట్రోల్ చేయడం కోసం నిరంతరం పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగానే శనివారం సూర్జాపూర్ గ్రామంలో ఎస్సై గంగారాం(SI Gangaram) పోలీసులు పలు గృహాలను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాల ఉన్నాయనే సమాచారం మేరకు సూర్జాపూర్ లోని అనుమానితుల ఇండ్లను సోదా చేశారు. ఈ సోదాల్లో నకిలీ విత్తనాలు లభించలేదు.

నకిలీ విత్తనాల వాడకంపై, లాభనష్టాలను పోలీసులు రైతులకు వివరించారు. నకిలీ విత్తనాలు వాడడం వల్ల భూమి సారవంతం కోల్పోయి రానున్న రోజుల్లో పంట దిగుబడి తగ్గుతుందనీ అవగాహన కల్పించారు. అంతేకాకుండా పర్యావరణం పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనీ చెప్పారు. గ్లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు. ప్రధానంగా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందనీ తెలిపారు. ఎవరూ కూడా నకిలీ విత్తనాలు అమ్మడం కొనడం కానీ చేయకూడదని హెచ్చరించారు. అదే విధంగా ఏ గ్రామంలోనైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు ప్రజలకు తెలిస్తే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని కోరారు.