calender_icon.png 19 April, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ సందర్భంగా పోలీసుల తనిఖీలు

31-03-2025 12:04:09 AM

మేడ్చల్, మార్చి 30 (విజయ క్రాంతి): రంజాన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా రాచకొండ పోలీస్ కమిషనర్ పరిధిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా వివిధ ప్రాంతా లలో యాంటీ సబుటేజ్ చెక్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు. పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు ఆదేశాల మేరకు ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్, సరూర్నగర్ దర్గా, బాలాపూర్ దర్గా తోపాటు వివిధ ప్రాంతాలలో తనిఖీలు చేశారు. ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొనే ప్రార్థన స్థలాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సిపి ఆదేశించారు. అన్ని వాహనాల నంబర్ ప్లేట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు తనిఖీ చేయాలని సూచించారు. ఏ చిన్న సంఘటన జరిగినా తేలికగా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలన్నారు.