calender_icon.png 25 March, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమానితుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు..

23-03-2025 05:21:02 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో నకిలీ విత్తనాలు ఉన్నాయన్న సమాచారంతో అనుమానితుల ఇళ్లల్లో ఎస్సై గంగారం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో రైతులకు నకిలీ పత్తి విత్తనాలు, గ్లైపోసిట్ వాడటం వల్ల ఏర్పడే నష్టాలను వివరించారు. నకిలీ పత్తి విత్తనాలను వాడడం వల్ల భూమి యొక్క సారవంతం కోల్పోయి పంట దిగుబడులు పూర్తిగా తగ్గిపోయి నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడడం వల్ల రైతులకు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మండలంలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినా, కొనుగోలు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రైతులను కోరారు.