28-04-2025 01:35:20 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27(విజయక్రాంతి) : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. అధునాతన పాపిలాన్ పరికరాలు, బ్లేజ్ శునకాలను ఉపయో గించి రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్‌హాల్‌లు, ప్లాట్‌ఫామ్‌లు, పార్సిల్ కార్యాలయాల్లో క్షుణ్ణంగా సోదాలు జరిపారు. అనుమనితు లు, అనుమానాస్పద వస్తువులను పరిశీలించారు. ప్రయాణంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా భద్రత పరంగా ముందుజాగ్రత్తగా తనిఖీలు చేపట్టారు.