అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనబడితే పోలీసులకు సమాచారమివ్వాలి
ఏసీపీ గోదావరిఖని రమేష్
పెద్దపెల్లి (విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లా రామగుండం పోలీస్ స్టేషన్ లో సోమవారం సాయంత్రం గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ సంధ్య, స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులతో కలిసి రైల్వేస్టేషన్‌లో విసృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు.
పార్సిల్ ఆఫీస్, రైల్వేస్టేషన్ ఏరియా తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న అండర్ రైల్వే రూమ్‌లు, డార్మెటరీలు, ప్రైవేట్ రూమ్‌లు, ఆ ప్రదేశంలో ఉన్న హోటళ్లు ను తనిఖీ చేసి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ, రైల్వే పోలీస్ లతో మాట్లాడి పాత నేరస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానం ఉంటే వెంటనే రైల్వేపోలీసులు, స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని ఏసీపీ సూచించారు. ఈ కార్యక్రమం గోదావరిఖని 1- టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి, ఆర్ పి ఎఫ్ సీఐ సురేష్, ఎస్ఐ లు సబ్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు.