19-04-2025 11:14:48 PM
రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో ఈనెల 16న కల్లుదుకాణంలో రాత్రి చొరబడి దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని శనివారం పోలీసులు పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కు పంపినట్లు ఎస్సై పుష్పరాజు తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపేట మండలం తలమడ్ల గ్రామంకు చెందిన చమాన్ నరేష్ వ్యక్తి ఇదివరకు కూడా నేర ప్రవృత్తి క్రిమినల్ హిస్టరీ ఉన్నందున అతనిని పట్టుకొని రిమాండ్ తరలించి జైలుకు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా గ్రామాల్లో రాత్రిళ్ళు తిరిగినట్టు అయితే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. దొంగతనాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించబడుతుందని రాజంపేట ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.