బెంగళూరు: తనపై మైనింగ్ కేసును విచారిస్తున్న సీనియర్ పోలీసు అధికారిని బెదిరించిన ఆరోపణలపై కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామిపై కేసు నమోదైంది. కుమారస్వామి తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించాడంటూ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం. చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుమారస్వామి నిందితుడిగా ఉన్న మైనింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను నేతృత్వం వహిస్తున్నట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. తనను బెదిరించి మైనింగ్ స్కామ్ విచారణ అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఏడీజీపీ స్పష్టం చేశారు. అటు అక్రమ మైనింగ్ కేసును సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. కుమారస్వామి 2006 నుంచి 2008 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి బళ్లారి జిల్లాలోని శ్రీ సాయి వెంకటేశ్వర మినరల్స్ (ఎస్‌ఎస్‌విఎం)కి 550 ఎకరాల మైనింగ్ లీజుకు అక్రమంగా ఆమోదించారనే ఆరోపణలపై కుమారస్వామిపై విచారణ జరిగింది.