04-09-2024 12:43:13 PM
సంగారెడ్డి: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వగా సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంధర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. హైడ్రా పేరుతో బండ్ల విప్లవ్ సిన్హాపై అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి, మంజునాథ్రెడ్డి అనే బిల్డర్లు అమీన్ పూర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారని ఎస్పీ తెలిపారు.