అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై షాక్ తగిలింది. బేతంచెర్ల పోలీస్ స్టేషన్ లో బుగ్గన పై కేసు బుక్ అయింది. సోమవారం డోన్ స్వతంత్ర అభ్యర్థి పిఎస్ బాబు కారుపై బుగ్గన అనుచరులు దాడిచేశారు. బుగ్గన తనను కులం పేరుతో దూసిస్తూ దాడి చేశారని పీఎస్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుగ్గన సహా అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో లింగ్ స్టేషన్ల వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్లలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.