బెల్లంపల్లి, (విజయ క్రాంతి): అరిజిన్ డెయిరీ ఏర్పాటు కోసం మాకు అమ్మిన భూమిని మా పేరున రిజిస్ట్రేషన్ చేయిస్తానని చెప్పి తమను నమ్మించి మోసం చేసిన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై పోలీసులు కేసు నమోదు చేయాలని అరిజిన్ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ ఆదినారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022 ఆగస్టు లో బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారు లోని సర్వే నెంబర్ 89/2/1 లో 3.07 ఎకరాల భూమి ని రూ 30 లక్షల కు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమకు భూమి అమ్మాడని ఆయన పేర్కొన్నారు.
కార్తీక మాసం సందర్భంగా ఆ భూమిలో తాము భోజన కార్యక్రమం పెట్టేందుకు రెండు రోజులు గా భూమిని కూలీలతోచదునుచేస్తున్నామనిఆదినారాయణతెలిపారు.భూమితో ఎలాంటి సంబంధం లేని చిన్నయ్య ఆ భూమి నాదే హంగామా చేసి కూలీలను బెదిరించారని చెప్పారు. ఈ విషయం పై దుర్గం చిన్నయ్య పై పోలీసులు కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.దుర్గం చిన్నయ్య ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నాపై పోలీసులతో 14 తప్పుడు కేసుల తో పాటు పీడీ యాక్ట్ కేసు కూడా పెట్టించాడని ఆరోపించారు. చిన్నయ్య చేసిన భూకబ్జా ల బాగోతాన్ని బయట పెడతామన్నారు. మాకు డెయిరీ పెట్టేందుకు సహకరిస్తానని ఆంటే చిన్నయ్యకు కోటి రూపాయలకు పైగా డబ్బులు ఇచ్చామని ఆదినారాయణ పేర్కొన్నారు.మా అధీనం లోఉన్న ఈ భూమిని భూమిలేని పేదలకు ఉచితంగా పంచి పెడతామన్నారు. దమ్ము ధైర్యం ఉంటే చిన్నయ్య తాను ఉన్న సమయం లో భూమి వద్దకు వచ్చి మాట్లాడాలని సవాలు చేశారు. ఇప్పటికీ తానే ఎమ్మెల్యే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని , ఆయన మాజీ ఎమ్మెల్యే అనే విషయం మర్చి పోవడం సిగ్గు చేటన్నారు.మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు దమ్మూ, ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి తన తో మాట్లాడాలని సవాల్ చేశారు.ఈ సమావేశం లో కూలీలు జంగేటి దుర్గాభవాని,రామటెంకి హరిబాబు,శరణ్య,సునార్కర్ ప్రణీత, అచ్చెశివ తదితరులు పాల్గొన్నారు.