- రైతు వేదికలో దొంగతనం పేరుతో చిత్రహింసలు
- దెబ్బలకు తాళలేక ఆత్మహత్యాయత్నం
- హుజూర్‌నగర్‌లో ఘటన
హుజూర్‌నగర్, జనవరి 3: రైతు వేదికలో జరిగిన చోరీ కేసులో పోలీస్ సిబ్బంది తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఓ దళిత యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం హుజూర్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని రామస్వామిగుట్ట వద్ద ఉన్న రైతు వేదికలో పార్వతమ్మ వాచ్‌మెన్‌గా పనిచేస్తు న్నది.
గత నవంబర్ నెలలో రైతువేదికలో రూ.3.70 లక్షల విలువైన సామగ్రి చోరీ అయ్యాయని ఏవో స్వర్ణ స్థానిక పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాచ్‌మెన్‌గా పనిచే స్తున్న పార్వతమ్మను పోలీస్టేషన్‌కు పిలిపించి విచారించారు. పార్వతమ్మ రైతువేదికను శుభ్రం చేయడం మాత్రమే తన విధి అని, తనకు చోరీ విషయం తెలియదనడంతో ఆమె కుమారుడైన ఊదర గోపిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలకు గురిచేశా రని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిం చారు.
తాను చోరీ చేయలేదని గోపి చెప్పినా వినకుండా పోలీసులు దాడి చేసినట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. విచారణ పేరు తో పోలీస్టేషన్‌కు పిలిచి నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో గోపి శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలిపారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసి అసలు నిందితులను గుర్తించాలని కోరారు.
ఏఈవో స్వర్ణతోపాటు పార్వతమ్మ వద్ద తాళాలు ఉండగా పార్వతమ్మను, అతని కుమారుడిని మాత్రమే విచారణ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పోలీస్ స్టేషన్ ఎస్సై ముత్తయ్యను వివరణ కోరగా.. గోపిలో ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.